రోడ్డు ప్రమాదంలో హనుమాన్ దీక్షలో ఉన్న యువకుడు మృతి

by Bhanu |

వెల్గటూర్ మండలం కప్పరావుపేట్ మజీద్ సమీపంలో ఆదివారం స్టేట్ హైవే జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజక్కపల్లి గ్రామానికీ చెందిన దొరిశెట్టి సత్తయ్య కుమారుడు నీక్షిత్ (18)అనే నవ యువకుడు మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో హనుమాన్ దీక్షలో ఉన్న  యువకుడు మృతి
X

దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండలం కప్పరావుపేట్ మజీద్ సమీపంలో ఆదివారం స్టేట్ హైవే జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజక్కపల్లి గ్రామానికీ చెందిన దొరిశెట్టి సత్తయ్య కుమారుడు నీక్షిత్ (18)అనే నవ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికీ చెందిన దొరిషెట్టి నీక్షిత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇటీవలే పూర్తి చేశారు. గ్రామంలోని మరికొంత మంది యువకులతో కలిసి హనుమాన్ దీక్ష తీసుకున్నాడు.ఈ క్రమంలోనే మినరల్ వాటర్ కోసమని బైక్ పై కప్పరావుపేట్ మజీద్ దగ్గర గల వాటర్ ప్లాంట్ కు వెళ్లి బైక్ పై ఇద్దరు రోడ్డు దాటు తున్నారు . అదే సమయంలో మరో ఇద్దరు యువకులు కరీంనగర్ వైపుగా బైక్ పై వేగంగా వెల్తూ రోడ్డు క్రాస్ చేస్తున్న రాజ క్కపల్లి గ్రామానికీ చెందిన యువకుల బైక్ ను డీ కొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ బ్యాక్ సీట్లో ఉన్న దొరిసెట్టి నిక్షిత్ తలపగిలి తీవ్ర రక్త స్రావం జరిగి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ప్రమాదానికి గురయిన రెండు బైక్ ల మీద ఉన్న యువకులు హనుమాన్ మాల ధారణ చేసుకున్న వారే కావటం విశేషం. ఒక్కగా నొక్క కొడుకును రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకున్న ఆ తల్లి దండ్రులు ఘటనా స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపించటం అందరిని కలిచివేసింది .




Next Story