వాగులో పడి యువకుడు మృతి

by Elthuri vijay kumar |

ధర్మపురి పట్టణానికి చెందిన వీరవేణి రాజకుమార్ (25)అనే యువకుడు ప్రమాదవశాత్తు వాగులో పడి గురువారం వరద ఉధృతికి కొట్టుకు పోయి మృతి చెందారు .

వాగులో పడి యువకుడు మృతి
X

వాగులో పడి యువకుడు మృతి

- ధర్మపురిలో విషాదం

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. ధర్మపురి పట్టణానికి చెందిన వీరవేణి రాజకుమార్ (25)అనే యువకుడు ప్రమాదవశాత్తు వాగులో పడి గురువారం వరద ఉధృతికి కొట్టుకు పోయి మృతి చెందారు . కమలాపూర్ శివారులోని వాగులో ఉన్న ఫిల్టర్ ఫెడ్‌లో పని చేస్తున్న యువకుడు విధులకు హాజరు కావడానికి గురువారం రాత్రి వాహనంతో వాగు దాటడానికి ప్రయత్నించగా వరద ఉధృతికి బైక్ తో సహా వాగులో కొట్టుకు పోయాడు. తెల్లవారి మధ్యాహ్నం వరకు కొడుకు ఇంటికి రాకపోవటంతో తల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలించగా ప్రమాద స్థలానికి కింద వాగు తీరంలోని ఓపొలంలో యువకుడు శవమై కనిపించాడు. మృతుడి తల్లి అమృతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

Next Story