ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యం.. పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు

by Bhanu |

ఇంట్లో నుంచి వెళ్ళిన ఓ యువతి అదృశ్యమైన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది.

ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యం.. పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు
X

దిశ, తంగళ్లపల్లి : ఇంట్లో నుంచి వెళ్ళిన ఓ యువతి అదృశ్యమైన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. ఇందిరానగర్ కు చెందిన మోతే రాధిక అనే 20 ఏళ్ల యువతి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లింది. అయితే.. అలా వెళ్లిన రాధిక ఇంటికి రాకపోవడంతో తన కోసం గాలించారు.. అప్పటికీ తన కూతురు ఆచూకీ లభించకపవ లేదని యువతి తల్లి మోతే రేణుక మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి రాధిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.

Next Story