- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కుప్పలకు ఢీ కొని యువకుడు మృతి..!
తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామ శివారులోని ప్రధాన రహదారి పై కొందరు రైతులు రహదారి పై ఆరబోసిన ధాన్యం కుప్పలు ఒకరి మృతికి కారమైనట్లు సమాచారం.

X
దిశ, తిమ్మాపూర్ : తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామ శివారులోని ప్రధాన రహదారి పై కొందరు రైతులు రహదారి పై ఆరబోసిన ధాన్యం కుప్పలు ఒకరి మృతికి కారణమైంది. వివరాలు పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ మండలం ముక్దంపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల రంజిత్(32) తన స్నేహితుడు సాజిత్ తో కలిసి కరీంనగర్ వైపు వెళ్తుండగా మల్లాపూర్ సమీపంలోని రహదారి పై కొందరు రైతులు ఆరబెట్టిన ధాన్యం కుప్పల పైకి ఎక్కించగానే బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదం లో రంజిత్ అక్కడికక్కడే మృతి చెందగా సాజిత్ కు స్వల్ప గాయలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న ఎల్ఎండి పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






