విద్యార్థులతో వెట్టి చాకిరీ

by velandi.Saikiran |

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు బాట వేయాల్సిన శుక్రవారం పనులు చేయించారు ఉపాధ్యాయులు. పాఠశాల భవనం

విద్యార్థులతో వెట్టి చాకిరీ
X

దిశ, కరీంనగర్ టౌన్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు బాట వేయాల్సిన శుక్రవారం పనులు చేయించారు ఉపాధ్యాయులు. పాఠశాల భవనం పైన ఉన్న చెత్తను విద్యార్థులతో పారబోయించారు. పాఠశాలలను శుభ్రంగా ఉంచడానికి ఆయాలను ప్రతి పాఠశాలకు ప్రభుత్వం నియమించింది. వారితో కాకుండా విద్యార్థులతో పనులు చేయించడం విమర్శలకు దారితీసింది. కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ ఎదురుగా ఉన్న డైరీ పెట్రోల్ బంక్ సమీప ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులతో లేబర్ పనులు చేయిస్తున్న ఘటన వెలుగుచూసింది. దీనిపై హెడ్‌మాస్టర్ దినేష్ కుమార్‌ను స్థానికులు ప్రశ్నించగా, ఆయన "మాకు జీవో వచ్చింది, విద్యార్థులతో పని చేయించుకోవచ్చని" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.అయితే ఆ భవనానికి మెట్లు కూడా లేని పరిస్థితిలో, ఒక నిచ్చెనపైకి ఎక్కించి విద్యార్థులతో ప్రమాదకరంగా పని చేయించడం చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో హెడ్‌మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story