పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దారుణ హత్య

by Bhanu |   (  Updated:2025-05-26 16:18:19  IST  )

చందుర్తి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటి దూరంలో బొల్లు మల్లవ్వ అనే మహిళ (60 సంవత్సరాల ) పొలం వద్ద నుండి పని ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రధాన రహదారి అయిన పెద్దమ్మ ఆలయం వద్ద విచక్షణ రహితంగా హతమార్చి నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం.

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దారుణ హత్య
X

దిశ, చందుర్తి : వరసకు చిన్న అమ్మమ్మ అయ్యే ఓ మహిళను కత్తితో అతి కిరాతకంగా యువకుడు హతమార్చిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బొల్లు మల్లవ్వ అనే మహిళ (60 ) సోమవారం సాయంత్రం పొలం వద్ద నుండి పని ముగించుకొని తిరిగి వస్తుంది. ఈ క్రమంలో మండల కేంద్రంలో వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారి ప్రక్కన పెద్దమ్మ ఆలయం సమీపంలో మల్లవ్వను హంతకుడు బొల్లు మనోజ్ విచక్షణ రహితంగా హతమార్చాడు.

అనంతరం హంతకుడు కత్తితో సహా చందుర్తి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ హత్యను చూసి గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి సీఐ వెంకటేశ్వర్లు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా మృతురాలి కుటుంబానికి, హంతకుడి కుటుంబానికి గత కొద్ది కాలంగా భూవివాదాల నేపథ్యంలో గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఇంత దారుణ హత్య జరగడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.

Next Story