పిడుగుపాటుకు మహిళ మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2023-05-09 12:18:49  IST  )

రోజూలాగే వ్యవసాయ పనులకి వెళ్లిన ఆ దంపతులు పిడుగుపాటుకు గురైన ఘటన మండలం పరిధిలోని పెంబట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

పిడుగుపాటుకు మహిళ మృతి
X

దిశ, సారంగాపూర్ : రోజూలాగే వ్యవసాయ పనులకి వెళ్లిన ఆ దంపతులు పిడుగుపాటుకు గురైన ఘటన మండలం పరిధిలోని పెంబట్ల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జోగిని గంగమల్లు, పద్మ దంపతులు వరి కోత పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒక్కసారిగా మేఘావృతమే ఒక్కసారిగా దంపతులు పిడుగుపాటు గురయ్యారు. గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఇరువురిని జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించగా పద్మ మృతి చెందగా.. గంగమల్లుకి గాయాలయ్యాయి. పనుల్లో కూడా తోడునీడగా ఉన్న దంపతులు ఇలా పిడుగుపాటుకు గురి కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story