- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఠాగూర్ సినిమాను మైమరిపించిన వన్ హాస్పిటల్ వైద్యుల తీరు
నగరంలో కోర్టు రోడ్డులో గల వన్ హాస్పిటల్ వైద్యుల తీరు ఠాగూర్ సినిమాను మైమర్పించింది. చనిపోయిన మహిళలకు వైద్యం అందిస్తున్నట్లు నటిస్తూ చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి వన్ హాస్పిటల్ యాజమాన్యం తెరలేపింది.

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : నగరంలో కోర్టు రోడ్డులో గల వన్ హాస్పిటల్ వైద్యుల తీరు ఠాగూర్ సినిమాను మైమర్పించింది. చనిపోయిన మహిళలకు వైద్యం అందిస్తున్నట్లు నటిస్తూ చికిత్స పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి వన్ హాస్పిటల్ యాజమాన్యం తెరలేపింది. వేములవాడ మండలం షాత్రాజూపల్లికి చెందిన సాహెబ్ బీ (60) గుండె సంబంధిత వ్యాధితో గత శుక్రవారం ఈనెల 10వ తేదీన నగరంలోని కోర్టు రోడ్డు లో గల వన్ ఆసుపత్రిలో చేరింది. యాంజియోగ్రామ్ నిర్వహించి అనంతరం వివిధ సాకుల పేరిట మంగళవారం ఆపరేషన్ చేశాక, తర్వాత మహిళ వైద్యం వికటించి సాహెబ్ బి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో క్రమేపి వన్ హాస్పిటల్ లో వైద్యం వికటిస్తూ చనిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని తక్షణమే ఈ ఆసుపత్రి అనుమతులను రద్దు చేయాలని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ కలెక్టర్ ను కోరారు.
ఆసుపత్రి ఎండి మహేష్ రెడ్డి తో పాటు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వైద్యులందరిపై హత్య కేసు నమోదు చేయాలని జిల్లా పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎంతమంది చనిపోతే ఈ ఆసుపత్రి గుర్తింపును అనుమతులను రద్దు చేస్తారని ప్రశ్నించారు. గడచిన వారం రోజుల్లో ఇద్దరు వేములవాడకు సంబంధించిన వాసులు వైద్యం కోసం వచ్చి చనిపోయినట్లు విమర్శించారు. నిర్లక్ష్యంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న ఆస్పత్రిని తక్షణమే కలెక్టర్ స్పందించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన మృతదేహానికి వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ చికిత్స పేరుతో కొంటె సాకులు చెబుతూ డబ్బులు వసూళ్ల పర్వానికి ఆసుపత్రి యాజమాన్యం తెరలేపిందని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను తీస్తున్న ఆసుపత్రి యాజమాన్యం ప్రాణాలు పోయాక కొందరు బ్రోకర్లను పెట్టుకొని బేరసారాలకు దిగుతోందని విమర్శించారు. మృతురాలి కుమారులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో సాహెబ్ బీ మృతి చెందిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యుల దరఖాస్తును స్వీకరించి కరీంనగర్ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామన్నారు. మృతురాలికి అండగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు, ఇద్దరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తరలివచ్చారు.






