భర్తను స్పృహ కోల్పోయేలా చేసి.. ప్రియుడితో కలిసి భార్య పాడు పని

by Seetharam |

దిశ,రాజన్నసిరిసిల్ల: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే చున్నీతో గొంతునులిమి హత్య చేసిన భార్య ఉదాంతం రాజన్నసిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.

భర్తను స్పృహ కోల్పోయేలా చేసి.. ప్రియుడితో కలిసి భార్య పాడు పని
X

దిశ,రాజన్నసిరిసిల్ల: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే చున్నీతో గొంతునులిమి హత్య చేసిన భార్య ఉదాంతం రాజన్నసిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్స్‌టైల్ పార్క్‌లో ఆగస్టు 11న పల్లె నర్సింహులు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నర్సింహులు మరణంపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సింహులు భార్య మమతపై పోలీసులకు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. మమత పోలీసులు విచారణలో అసలు విషయం ఒప్పుకుంది.

తంగళ్లపల్లి మండలం కస్బె కట్కూర్ గ్రామానికి చెందిన బెల్లె సురేష్ అనే ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 11న మమత తన భర్త నర్సింహులకు అన్నంలో మత్తు మందు పెట్టి స్పృహ కోల్పోయేలా చేసింది. ప్రియుడు బెల్లె సురేష్, ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన మెండే విష్ణు సహకారంతో నర్సింహులు మెడకు చున్నీ బిగించి ఉరి వేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నింధితులను పట్టుకొని వారి నుంచి మొబైల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన చున్నీ స్వాధీనం చేసుకొని, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ ఉపేందర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Next Story