- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్త పై దాడి చేసి అదృశ్యమైన భార్య
భార్యాభర్తల మధ్య తగవులాట పెరిగి పెద్దదై భర్త పై భార్య దాడి చేసిన ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది.

దిశ, శంకరపట్నం : భార్యాభర్తల మధ్య తగవులాట పెరిగి పెద్దదై భర్త పై భార్య దాడి చేసిన ఘటన శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు గాజుల రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలంలోని మక్త గ్రామానికి చెందిన గాజుల రాజుకు చల్లూరు గ్రామానికి చెందిన శ్యామలతో 14 సంవత్సరాల క్రితం వివాహం అయింది. తమకు ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అని అయితే గత కొంతకాలం నుండి తమ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలోనే శుక్రవారం గొడవ జరిగిందని తెలిపాడు.
ఈ గొడవలోనే తన భార్య దాడి చేయడంతో తాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు తెలిపాడు. గమనించిన స్థానికులు 108 లో హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీనితో ఆ రోజు నుండి తన భార్య శ్యామల కనిపించకుండా పోయిందని రాజు హుజరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన భార్య మానసిక స్థితి బాగా లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగినట్లు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.






