- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లొట్టపిసు కేసులైతే కేటీఆర్ కు భయమెందుకు
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అయితే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, భూగర్భ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి ప్రశ్నించారు.

లొట్టపిసు కేసులైతే కేటీఆర్ కు భయమెందుకు
- కాళేశ్వరం అవినీతిపై సొంత చెల్లెలే ఆరోపణలు
- సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కేటీఆర్
- కేసీఆర్ ఫామ్ హౌజ్ కు నీళ్ల కోసమే మల్లన్న సాగర్
- సిరిసిల్లలో మంత్రి వివేక్ వెంకట స్వామి
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అయితే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, భూగర్భ, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి ప్రశ్నించారు. బుదవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రాగుల రాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సకల జనుల సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి.గీతే లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా కుల సంఘాల పెద్దలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీగా వచ్చిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి వివేక్ వెంకట స్వామి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కమిషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఆ ప్రాజెక్టు అవినీతిపై సొంత చెల్లెలు కవిత ఆరోపణలు చేస్తుంటే, కేటీఆర్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోవడానికే మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, హైదరాబాదుకు 20 టీఎంసీల నీళ్లు అందించడానికి గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.36 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టిందని గుర్తు చేశారు. అప్పటికే ఆయా ప్రాజెక్టుల నిర్మాణం కోసం 11 వేల కోట్లు ఖర్చు చేసిందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుగా మార్చి, కల్వకుంట్ల కుటుంబం లక్ష కోట్లు కొల్లగొట్టిందని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో తప్ప కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కు చుక్క నీరు రాలేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ అండతో సిరిసిల్లలో సాండ్ మాఫియా రాజ్యమేనిందని, ఇసుక మాఫియా ఆగడాలకు దళితుల ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అరాచక పాలనను భరించలేక ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తీసుకెళ్లినా, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం యువతకు అడ్వాన్స్ టెక్నాలజీతో ఉచిత ఉద్యోగ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా, రానున్న రెండేళ్లలో మరో రెండు లక్షల ఉద్యోగాలు అందించాలనే కృతనిచ్చేయంతో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. తన తండ్రి వెంకటస్వామితో సిరిసిల్లకు విడదీయలేని అనుబంధం ఉందని, చేనేత, జోలి శాఖ మంత్రిగా ఆయన నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. తన తండ్రి చూపిన దారిలో నడిచి ప్రజాసేవకే అంకితం అవుతానని, సిరిసిల్ల నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






