- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ లో అసలు మా భవిష్యత్తు ఏంటి.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో అసలు మా భవిష్యత్తు ఏంటో మాకే అర్థం కావడం లేదు. తీవ్ర అవమానాలను భరిస్తూ పార్టీలో ఇంకెంతకాలం కొనసాగాలనే విషయమై సందిగ్ధంలో ఉన్నామంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీలో అసలు మా భవిష్యత్తు ఏంటో మాకే అర్థం కావడం లేదు. తీవ్ర అవమానాలను భరిస్తూ పార్టీలో ఇంకెంతకాలం కొనసాగాలనే విషయమై సందిగ్ధంలో ఉన్నామంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోమవారం ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడారు. వలస వాదులకు కాకుండా కాంగ్రెస్ జెండా మోసిన వారికి చైర్ పర్సన్ పదవి ఇవ్వాలనడం తప్పా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై భిన్నాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టాలి.. కానీ జెండా మోసిన కార్యకర్తలను ఎందుకు బలి చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యంగా వలసవాదులకు చైర్ పర్సన్ పదవి ఇచ్చారంటూ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి వలస వచ్చిన నాయకుల ఆధ్వర్యంలో పని చేయాలా అంటూ కాంగ్రెస్ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. సీనియర్ నాయకుడైన తన పరిస్థితి ఇలా ఉంటే ఫిరాయింపుల జరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అసలైన కార్యకర్తలకు న్యాయం జరగాలనే తాను తాపత్రయ పడినట్లు తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు రాసిచ్చారా? పార్టీ అంతర్గత విషయాల్లో ఆయన జోక్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత సీసాలో కొత్త సారా పోసినట్లు జగిత్యాల కాంగ్రెస్ పరిస్థితి తయారైందని అన్నారు. ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నన్ని రోజులు ఈ అవమానాలు తప్పవని అయితే వాటిని భరిస్తూ పార్టీలో కొనసాగే విషయంలో తీవ్ర మానసిక క్షోభ కు గురవుతున్నానని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సొంత పార్టీతో విభేదాలుంటే ఇండిపెండెంట్ గా పని చేయాలని అంతే తప్ప.. తమ కాంగ్రెస్ వ్యవహారాల్లో చిచ్చు పెట్టకూడదని హితవు పలికారు.






