సీఎం కేసీఆర్ కు పట్టపగలే చుక్కలు చూపిస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్

by Disha Web Desk 1 |
సీఎం కేసీఆర్ కు పట్టపగలే చుక్కలు చూపిస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
X

దిశ, కరీంనగర్ : న్యాయబద్ధంగా సమ్మే చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే.. తమ కార్యకర్తలతో రోడ్లపైకి వచ్చి సీఎం కేసీఆర్ కు పట్టపగలే చుక్కలు చూపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం కలెక్టర్ వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమ్మె పూర్తిగా న్యాయబద్దమైనదని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరి పాత్ర కీలకమన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పుస్కరాలు, అవార్డులు రావడం వెనుక వారి శ్రమ అనన్యసామన్యమని అన్నారు. తన పాలన వల్లే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పందంగా ఉందన్నారు.

తల్లిదండ్రులు కూలీనాలీ చేసి చదివిస్తే కష్టపడి పోటీ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరితే ప్రొబేషనరీ పేరుతో నాలుగేళ్లు ఏళ్లు జాప్యం చేయడం దుర్మార్గమని అన్నారు. అసెంబ్లీ వేదికగా జూనియర్ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన మాట మీద నిలబడకపోవడం సిగ్గుచేటన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రజాస్వామ్యబద్దంగా సమ్మె చేస్తే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ బీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఎం మొండితనానికి వెళ్లకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలన్నారు.



Next Story

Most Viewed