- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుల్తానాబాద్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగురావేస్తాం : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పర్యటన చేసి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విస్తృత చర్చలు జరిపారు.

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పర్యటన చేసి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విస్తృత చర్చలు జరిపారు. ప్రజా సమస్యలే ఎజెండగా ఇంటింటా ప్రచారం, బూత్ కమిటీల బలోపేతం, కార్యకర్తల సమన్వయంతో విజయము దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, మున్సిపాలిటీ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో బిజెపి ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలను బీజేపీ లోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. బీజేపీ పై ప్రజల నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని, నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ – ఆత్మనిర్భర్, శక్తివంతమైన, సమృద్ధిశాలీ భారత నిర్మాణమే మా లక్ష్యమని మల్క కొమురయ్య తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా సౌదరి మహేందర్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, 15వార్డుల ఆశావాహులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






