ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Ratna Kumari |

రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం : రాష్ట్ర సాంఘిక  సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, ధర్మపురి : రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన నియోజక వర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి అడ్లూరి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చని పథకాలను సైతం అమలు చేస్తున్నామన్నారు.

ధర్మపురి అభివృద్ధికి కృషి

గతంలో ఎన్నడులేని విధంగా నియోజకవర్గ ఆభివృద్ధికి కృషి చేస్తున్నమని మంత్రి తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని , ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 450 కోట్ల అంచనాలతో ధర్మపురిలో పుష్కర ఘాట్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందని మంత్రి తెలిపారు. తొలి విడత టైర్ వన్ ద్వారా రూ. 115 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు ధర్మపురికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభ మయ్యాయని ధర్మపురి నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లు పొందాలని మంత్రి సూచించారు.

రైతు ప్రభుత్వం

గడిచిన రెండున్నర ఏళ్ల ప్రజా పాలనలో ధర్మపురి నియోజకవర్గంలోని 474 రైతులకు రైతు బీమా పథకం ద్వారా రూ. 18 కోట్ల 7లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకంలో 1,21,851 మంది రైతులకు రూ 188 కోట్ల 48 లక్షలు నియోజకవర్గంలోని 21, 917 మంది రైతులకు రూ.161 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన వ్యవసాయ యాంత్రీకరణను తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గాల్లోని 124 మంది రైతులకు 54 లక్షల 35 వేల విలువైన వ్యవసాయ యంత్రాలను అందజేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా గుర్తింపు పొందిందన్నారు.నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 3104 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేసి 139 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు.


గృహజ్యోతి పథకంలో 49వేల 444 మంది లబ్ధిదారులకు 200 లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. చేయూత పెన్షన్ పథకం ద్వారా 49 వేల 299 మంది లబ్ధిదారులకు 10 కోట్ల 97 లక్షలను జమ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో 2862 మందికి 10కోట్ల 91 లక్షలు అందించినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో 15,835 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింద న్నారు ప్రజా ప్రభుత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని మంత్రి తెలిపారు.నియోజకవర్గంలోని రైతులు పండించిన దాన్యాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మక్కజొన్న రైతులకు మద్దతు ధర చెల్లించడానికి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.


Next Story