- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతాం
రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తామని, రాబోయే ఐదు సంవత్సరాలలో అరులైన నిరుపేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి సొంతింటి కలలు నిజం చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతాం
ఐదేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
మార్పు తీసుకొస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
దిశ, భూపాలపల్లి : రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తామని, రాబోయే ఐదు సంవత్సరాలలో అరులైన నిరుపేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి సొంతింటి కలలు నిజం చేస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గురువారం సాయంత్రం కాటారం మండల కేంద్రంలో ఆయన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద తన సొంత ఇంట్లో ఉండాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు రూ.5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని, రెండు నెలల్లో నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అవినీతికి పాల్పడినా అధికారులపై కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కాటారంలో ఇంజనీరింగ్ కాలేజీ మంజూరుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రతి ఒక్క పేద బిడ్డ చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలని ఆయన ఆశించారు. ప్రతి పేదవాడు సొంత ఇంట్లో ఉంటూ పిల్లలు ఉన్నతమైన చదువులు చదివినప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని అలాంటి మార్పును తాము కోరుకుంటున్నామన్నారు. ప్రజల్లో మార్పు తెచ్చి అభివృద్ధి వైపు పైనుంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని సక్రమంగా అందేలాచేస్తామని అదే విధంగా ఆ మార్పుతో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలకు అన్ని విధాలుగా సహాయంచేస్తామన్నారు. అనంతరం కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని 350 మంది మహిళలకు ఇందిరమ్మ మంజూరి పత్రాలు పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి గ్రంధాలయ చైర్మన్ కోట రాజబాబు యుజిఎస్ కౌన్సిలింగ్ మెంబర్ రమేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య తోపాటు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






