- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం : మంత్రి కేటీఆర్
by Kema Shiva Kumar |
అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు సతమతమవుతున్న విషయం విధితమే. కాగా, మంగళవారం మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలంలో పర్యటించారు.

X
దిశ, ముస్తాబాద్: అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు సతమతమవుతున్న విషయం విధితమే. కాగా, మంగళవారం మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రైతులు అధైర్య పడొద్దని అకాల వర్షాలు ఎందుకు కురుస్తున్నాయో అర్ధం కావడం లేదన్నారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనంతరం గోపాల్ పల్లెలోని నరేష్ అనే రైతు ధాన్యం అంతా నీళ్ల పాలైన విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అతడిని గ్రామంలో కలిసి అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంటను అధికారులు గుర్తిస్తున్నారని.. ఎకరాకు రూ.10 వేలు నేరుగా రైతు అకౌంట్ లో జమ కానున్నాయని ఆయన భరోసానిచ్చారు.
Next Story






