గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం

by Ratna Kumari |

కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన రూ.15 ల‌క్ష‌ల నిధుల‌తో చేపట్టిన సీసీ రోడ్లు పనులను బుధవారం కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.

గ్రామాల అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం
X

దిశ‌, క‌రీంన‌గర్ రూర‌ల్ : కేంద్ర మంత్రి బండి సంజ‌య్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా విడుదలైన రూ.15 ల‌క్ష‌ల నిధుల‌తో చేపట్టిన సీసీ రోడ్లు పనులను బుధవారం కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఆయకు సర్పంచ్ బుర్ర రమేష్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొబ్బరి కాయ కొట్టి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. కురుమ సంఘం నాయకులు బీరప్ప దేవాలయ నిర్మాణానికి సాయం అందించాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఇరుకుల్ల గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.


మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పలు ఇళ్లు కూలిపోవడం, పంట నష్టం వాటిల్లడంతో అన్నదాతకు అండగా బొమ్మకల్ లోని ఐకేపీ సెంటర్ ను సందర్శించారు సంజయ్. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ధ్వంసమైన ఇండ్ల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి .ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై .సునీల్ రావు,తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,4 వ డివిజన్ కార్పొరేటర్ భూపతి రవీందర్,బీజేపీ మండల అధ్యక్షుడు సంతోష్, ఎంపీడీఓ అశోక్,ఎంపీవో జగన్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ రాకేష్ ,కార్యదర్శి అభినవ్ పార్టీ కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story