- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అఘాయిత్యమా.. లేక దారి దోపిడా? పోలీసుల తీరుపై అనుమానాలు
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి శివారులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది.

దిశ బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి శివారులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందుకు విరుద్దంగా మారి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రజల సాక్షిగా జరిగిన ఓ అఘాయిత్యానికి ఆపై మారిన పరిస్థితులు అంతా సినిమా కట్టు కథను తలపిస్తుంది. రోడ్డు వెంట వెళ్తున్న ఓ మహిళపై బద్దిపల్లికి చెందిన యువకుడు అటకాయించి అఘాయిత్యానికి పాల్పడగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని నేరాన్ని విచారించి చరవాణిలో రికార్డు చేశారు. ప్రజల సమక్షంలో నిందితుడిని పట్టుకొని స్టేషన్‌కు తరలించారు.
సీన్ రీవర్స్.. కేసు తారుమారు
నిందితుడిని పబ్లిక్ లో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినప్పటి ఆ తర్వాత నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేశాయి. కళ్లముందు జరిగిన ఘటననే మరోలా వినేసరికి స్థానికులు అయోమయంలో పడిపోయారు.స్టేషన్ కు తరలించిన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించడం.. ఆపై రెండు రోజుల తర్వాత దొంగతనం కేసులో అదే నిందితుడిని రిమాండ్ చేసి జైలుకు పంపడం చర్చనీయాంశంగా మారింది.
అఘాయిత్యమా?...అత్యాచారమా?
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో గత శుక్రవారం మిట్ట మధ్యాహ్నం ఏం జరిగింది? అనేది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హట్ టాఫిక్ గా మారింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి వెళ్లిన బ్లూకోట్ పోలీసులు నిందితుడి నుంచి వాగ్మూలం తీసుకుని అదుపులోకి తీసుకోవడం.. ఆపై బాధితురాలిని ఎంసీ ఇచ్చి పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం.. ఆ వెను వెంటనే ఫిర్యాదు మార్చి రాయాలంటే తిరిగి స్టేషన్ కు తరలించడం ఇదంతా సినిమా సన్నివేశాన్ని తలపించింది. స్టేషన్ కు వెళ్లాక సీన్ రివర్స్ కావడం ఖాకీల నిజాయితీపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
బద్దిపల్లిలో అసలేం జరిగింది?
శుక్రవారం మధ్యాహ్నం సుమారుగా 12 గంటల సమయంలో కరీంనగర్ జిల్లా కోత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన ఓ మహిళా కమాన్ పూర్ గ్రామం నుంచి కొండాపూర్ లో జరుగుతున్న ఫంక్షన్ కు బయలుదేరింది. బద్దిపల్లి శివారులో బద్దిపల్లికి చెందిన సంజీవ్ మహిళను అడ్డగించి అఘాయిత్యానికి పాల్పడగా స్థానికులు బాధితురాలిని రక్షించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల వారిదైన శైలీలో మందలించి ఇద్దరిని స్టేషన్ కు తరలించారు. బాధిత మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించకుండా పిటిషన్ తిరిగి రాయించాలంటూ స్టేషన్ కు తరలించడంతో కేసు తారుమారు చేశారనే వదంతులు గ్రామంలో కలకలం రేపుతుంది.
చక్రం తిప్పిన బడా నేత..
నేరస్తుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి బంధువు కావడం.. అందులోనూ స్థానికంగా బలమైన సామాజికవర్గానికి చెందిన వాడు కావడంతో కేసు తారుమారు కావడానికి ప్రధాన కారణాలుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. సదరు నాయకుడు సైతం జరిగిన ఘటనను వక్రీకరించి మాట్లాడటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. ఏది ఏమైనా ఓ మహిళ అందులో దళితురాలు కావడం చేతనే నేరస్తులు కేసును సులువుగా పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అయితే జిల్లా పోలీస్ కమిషనర్ చొరవ తీసుకొని నిష్పాక్షపాతంగా విచారణ చేపడితే నిజా నిజాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.
అంతా తప్పుడు ప్రచారమే: నిరంజన్ రెడ్డి, కరీంనగర్ రూరల్ సీఐ
వాస్తవం ఓకలాగా ఉంటే ప్రచారం మరోలా జరుగుతుంది. నేరం జరిగినట్టు సమాచారం రాగా ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాం. బాధితురాలి ఫిర్యాదు మేరకు వాగ్మూలం రికార్డు చేసి కేసు నమోదు చేశాం. డబ్బుల కోసం నిందితుడు ఆ మహిళను కొట్టాడు. ఇదే విషయాన్ని బాధితురాలు చెప్పింది. నిందితుడు సైతం ఒప్పుకున్నాడు. దాని ప్రకారమే కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించాం. కేసు తారుమారు చేశారనే ఆరోపణలు అవాస్తవం.






