వేములవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలు

by velandi.Saikiran |

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ

వేములవాడలో ప్రశాంతంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన వేడుకలు
X

దిశ, వేములవాడ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేయగా పట్టణంలోనీ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులు ఒక్కొక్కటిగా వచ్చి గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఈ శోభాయాత్రను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి పరిశీలించారు. అనంతరం వినాయకుడికి పూజలు చేశారు. నిమజ్జన స్థలం వద్ద అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల భక్తి గీతాలు, ఇతర కళాకారుల మ్యాజిక్ షో భక్తులను అలరించింది. పిల్లలు, పెద్దలు ఆసక్తిగా తిలకించారు. అట్లాగే రాజన్న ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాధుడి నిమజ్జనం కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ ఈ.వో ఎల్.రమాదేవి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి గణేషుడినీ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాల్లో వేములవాడ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, తహసిల్దార్ విజయ్ ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మత్స్య శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పటిష్ట భద్రత, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా

శోభాయాత్రతో పాటు నిమజ్జన ప్రదేశం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సుమారు 2వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పట్టిష్టం చేశారు. నిమజ్జనానికి తరలివస్తున్న ప్రతి గణనాథుడి వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది వెంటే ఉంటూ శోభాయాత్ర సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్న వెంటనే స్పందించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు.

Next Story