ఎండ‌ప‌ల్లిలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాల‌ని గ్రామ‌స్తులు రాస్తారోకో

by Ratna Kumari |

ఎండపల్లి మండల కేంద్రం లోని రాష్ట్ర రహదారి పై గ్రామస్థులు ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తమ గ్రామంలోనే నిర్మిచాలని రాస్తారోకో నిర్వహించారు.

ఎండ‌ప‌ల్లిలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించాల‌ని గ్రామ‌స్తులు రాస్తారోకో
X

దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండల కేంద్రం లోని రాష్ట్ర రహదారి పై గ్రామస్థులు ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తమ గ్రామంలోనే నిర్మిచాలని రాస్తారోకో నిర్వహించారు. ఎంతో కష్టపడి సాధించుకున్న ఎండపల్లి మండలానికి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందని సర్పంచ్ సునీత తో కలిసి గ్రామస్థులు ఆరోపించారు. పేరుకే ఎండపల్లి మండలం పనులన్నీ రాజరాంపల్లి గ్రామంలోనే జరుగుతున్నాయని విమర్శించారు. ఇటీవల ఎండపల్లి మండలానికి వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాజా రాంపల్లి గ్రామంలో నిర్మించాలని చూస్తున్నారు. అలా చేయటం సరైనది కాదని, దానిని ఎండపల్లిలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. పేరుకే ఎండపల్లి మండలంగా ఉంది. ప్రభుత్వానికి ప్రేమ అంతా రాజా రాంపల్లి పైనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును ఎండపల్లి గ్రామంలోనే నిర్మించాలని.. లేదంటే మా ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమారు సైతం ఎండపల్లి మండల అభివృద్ధి పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు . ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పట్ల మంత్రి పునరాలోచన చేయాలని సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఎండపల్లి మండల కేంద్రం వద్ద ఎక్స్ప్రెస్ బస్ లు ఆపాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో తో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఉదయ్ కుమార్ ఆందోళన ప్రదేశానికి చేరుకొని సర్పంచ్, ప్రజలతో మాట్లాడి రాస్తారోకోను విరమింప చేశారు.

Next Story