- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుపేద కుటుంబానికి అండగా గ్రామస్తులు..!
అకాల మరణంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆ గ్రామం అండగా నిలిచింది. గ్రామ యూత్ ఆధ్వర్యంలో

దిశ, కోనరావుపేట : అకాల మరణంతో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి ఆ గ్రామం అండగా నిలిచింది. గ్రామ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఓ కార్యక్రమం ద్వారా ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందింది. మండలంలోని మర్తనపేట గ్రామానికి చెందిన గుర్రం సుమన్ (40) రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో కనీసం అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితిలో ఉండడం చూసి ఆ గ్రామ యువత మేల్కొంది. గ్రామ చత్రపతి యూత్ అధ్యక్షుడు లింగాల ప్రదీప్ రెడ్డి సోషల్ మీడియాలో నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలంటూ పెట్టిన పోస్ట్ కు గ్రామ ప్రజలు స్పందించారు. గ్రామంలోని ప్రముఖులతో పాటు గ్రామస్తులు స్పందించి దాదాపు రూ. 40,000 ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం గ్రామస్తులు ఆ నగదును భాధిత కుటుంబానికి అందజేశారు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తుల పట్ల మండల ప్రజలతో పాటు జిల్లా ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనపై వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడానికి కృషిచేసిన యువతను అభినందించారు.






