వికసిత్ భారత్ 2026 పోస్టర్ రిలీజ్

by Nallavelli.Anjaneyulu |

విక‌సిత్ భార‌త్ క‌రీంన‌గ‌ర్ జిల్లా స్థాయి యూత్ పార్ల‌మెంట్ 2026 పోటీల‌కు పోస్ట‌ర్ ను కేంద్ర మంత్రి బండి సంజ‌య్ గురువారం విడుద‌ల చేశారు.

వికసిత్ భారత్ 2026 పోస్టర్ రిలీజ్
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్ : విక‌సిత్ భార‌త్ క‌రీంన‌గ‌ర్ జిల్లా స్థాయి యూత్ పార్ల‌మెంట్ 2026 పోటీల‌కు సంబంధించిన‌ పోస్ట‌ర్ ను కేంద్ర మంత్రి బండి సంజ‌య్ గురువారం విడుద‌ల చేశారు. విక‌సిత్ భార‌త్ 2026 జిల్లా, రాష్ట్ర‌, జాతీయ స్థాయి పోటీల‌ను 18 నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల యువ‌తి, యువ‌కులు పోటీలో పాల్గొన‌వ‌చ్చు.

"50 ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ :

లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ" అనే విషయంపై మూడు నిమిషాల పాటు హిందీ ,ఇంగ్లీష్ ,తెలుగు భాషలలో మాట్లాడడానికి అవకాశం కల్పించారు. జిల్లా స్థాయి పోటీలకు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో 28 ఫిబ్రవరి 2026 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె రామకృష్ణ తెలిపారు.

ఈ పోటీల్లో పాల్గొనే వారు మై భార‌త్ పోర్ట‌ల్ లో విక‌సిత్ భార‌త్ ఈవెంట్ లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. టీజీసీ జీటీఏ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డాక్ట‌ర్ క‌డారు సురేంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగానే విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా వ్యక్తపరచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మేరా యువ భారత్ జిల్లా అధికారి ఎం. వెంకట రాంబాబు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ జిల్లా పేరు ప్రఖ్యాతులను జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేలా తమ ప్రతిభను ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సి పల్స్ పి.నితిన్ పాఠక్, శ్రీ టి. రాజయ్య, వికసిత్ భారత్ జిల్లా స్థాయి పోటీల సమన్వయకర్త బి. ఎలిజబెత్ రాణి అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ పిఓలు శ్రీనివాస్ రెడ్డి, సత్య ప్రకాష్, కే. అర్జున్, వెంకటేశ్వర్లు, రాజేందర్, రాజేష్ పాల్గొన్నారు.

Next Story