లింగాకర్షక బుట్టలతో చీడపీడల నివార‌ణ

by velandi.Saikiran |

పత్తి చేనులో లింగాకర్షణ బుట్టలను ఉపయోగించి చీడ పీడ‌ల‌ను నివారించవచ్చు ఆఫీసర్ వెంకట్ రెడ్డి అన్నారు.

లింగాకర్షక బుట్టలతో చీడపీడల నివార‌ణ
X

దిశ, గన్నేరువరం: పత్తి చేనులో లింగాకర్షణ బుట్టలను ఉపయోగించి చీడ పీడ‌ల‌ను నివారించవచ్చు అని ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పారువెళ్ల గ్రామంలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ ఆధ్వర్యంలో పత్తి పంట క్షేత్ర పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రైతులకు లింగాకర్షక బుట్టల వినియోగం, గులాబీ రంగు పురుగు నివారణ సస్యరక్షణ చర్యలను వివరించారు వెంకట్ రెడ్డి. రైతులకు లింగాకర్షణ బుట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బసవన్నప్ప, ఉదయ్ శంకర్, ఏవో కిరణ్మయి, ఏఈఓ అనూష రైతులు పాల్గొన్నారు.

Next Story