వేములవాడలో సెక్షన్ 144 అమలులోకి

by Bhanu |

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో భద్రతా చర్యల భాగంగా పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.

వేములవాడలో సెక్షన్ 144 అమలులోకి
X

దిశ, వేములవాడ టౌన్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో భద్రతా చర్యల భాగంగా పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు BNSS సెక్షన్ 163(3), సెక్షన్ 144 CrPC అమలులోకి తీసుకువచ్చారు.


ఈ మేరకు జూన్ 16, 2025 ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతల పనులు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేతల ప్రాంతమైన ఆలయ ప్రాంగణం నుండి 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడటం పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు.అధికారుల సూచన మేరకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు..

Next Story