- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి : మంత్రి పొన్నం
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం వేములవాడ నియోజకవర్గ స్థాయి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.

దిశ, వేములవాడ : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం వేములవాడ నియోజకవర్గ స్థాయి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పీసీసీ పరిశీలకులు పక్రుద్దిన్ ,కృష్ణా రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మండల ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్లు ,ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా నూతనంగా ఎఐసిసి సెక్రటరీ గతంలో ఎన్.ఎస్.యు. ఐ అధ్యక్షురాలిగా,పార్లమెంట్ సభ్యురాలిగా, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి గా పని చేస్తున్న మీనాక్షి నటరాజన్ క్షేత్ర స్థాయిలో పార్టీ స్థానిక సంస్థల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ, ఎవరైతే గ్రామ కాంగ్రెస్ పార్టీని నడపగలుగుతారో అలాంటి వారినే గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎన్నుకోవాలని సూచించారు. మండల అధ్యక్షులు గా సమష్టిగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మీ అందరి కృషి శ్రమ తో తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకుపోయి అన్ని ఎన్నికల్లో పార్టీ గెలిచేలా బాధ్యత మీదనీ, గ్రామ,మండల ,జిల్లా కాంగ్రెస్ నేతలు పార్టీ అధికారంలోకి రావడానికి ఎలా కష్టపడ్డారో ఇప్పుడు అలాగే క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలు తీసుకుపోయి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలాలు, గ్రామాల్లో పార్టీ పునఃనిర్మాణం జరగాలనీ, అనుబంధ సంఘాలు, యువజన సంఘాలు బలోపేతం కావాలని అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఆలయం అభివృద్ధి చేస్తున్నామని, కానీ కొంతమంది ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆలయ అభివృద్ధి శృంగేరి పీఠాధిపతి చెప్పిన సలహాల మేరకే జరుగుతుందని, ఇందులో ఎవరి వ్యక్తిగత రాజకీయ అవకాశాలు లేవనీ అన్నారు. ఆలయ అభివృద్ధితో వ్యాపారులను ఇబ్బందులు పెట్టాలని తమకు లేదనీ, పూజ కార్యక్రమాలకు ఇబ్బందులు లేవనీ స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు మేరకే ఆలయ అభివృద్ధి జరుగుతుందనీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనీ పార్టీ శ్రేణులకు సూచించారు.






