శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి

by velandi.Saikiran |

ఈ నెల 27నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని శేషాద్రిని రెడ్డి

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి
X

దిశ, వేములవాడ : ఈ నెల 27నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పూర్తి భక్తిభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వేములవాడ సబ్ డివిజన్ ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి డివిజన్ ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోమవారం వారు "దిశ"తో ప్రత్యేకంగా మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా ప్రజలకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోనీ, అధికారుల సూచనలు, ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని కోరారు. నిమజ్జనం రోజున ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోగా విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యేలా మండపాల నిర్వాహకులు కృషి చేయాలని ఆదేశించారు.

Next Story