- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దసరా కానుక...ఏకంగా 4 వేల ఇందిరమ్మ ఇండ్లు
దసరా కానుకగా కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి 4 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు.

దిశ, కరీంనగర్ రూరల్ : అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు. చెర్లబుత్కూర్ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 194 లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ... దసరా కానుకగా కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి 4 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారని తెలిపారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో కరీంనగర్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని కోరామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ అందజేయాలని తానే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసి లబ్ధిదారులందరికీ ప్రొసీడింగ్స్ అందించాలని సూచించారని రాజేందర్రావు తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాల కంటే అతి పెద్దది కావడంతో మరో నాలుగు వేల ఇండ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చర్లబుత్కూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






