- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ విషయంలో యువకుడి దారుణ హత్య..
ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వెల్గటూర్ మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఓ దారుణ హత్య చోటుచేసుకుంది.

దిశ, వెల్గటూర్ : ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వెల్గటూర్ మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. చల్లారి మల్లేష్ అనే యువకుడిని అడ్డగించి, రాష్ట్ర రహదారి పైన ఉన్న పెద్దవాగు వంతెనపై కొందరు కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మృతుడు మల్లేష్ గ్రామానికి చెందిన యువతితో గత సంవత్సరం నుంచి ప్రేమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల కిందట కేసులు కూడా నమోదైనట్టు సమాచారం. యువతి కుటుంబ సభ్యులు పలుమార్లు మల్లేష్‌ను హెచ్చరించినా, ప్రేమ వ్యవహారంలో మార్పు రాలేదు.
ఈ నేపథ్యంలో గురువారం మల్లేష్‌ను ప్రేమించిన యువతి బంధువులు అడ్డగించి తీవ్రంగా కొట్టి, అనంతరం పాత వైన్స్ షాప్ వెనక ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి హతమార్చినట్లు తెలిసింది. హత్య అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి వారు పరారైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.






