మాదక ద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా..

by Bhanu |

ప్రస్తుత సమాజంలో యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫోన్‌లకు అతుక్కుపోయి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ విపత్తును అరికట్టేందుకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామ యువత వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

మాదక ద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా..
X

దిశ, మానకొండూరు : ప్రస్తుత సమాజంలో యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫోన్‌లకు అతుక్కుపోయి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ విపత్తును అరికట్టేందుకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామ యువత వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. క్రీడలతో దుర్వ్యసనాలకు చెక్ క్రీడల ద్వారా దుర్వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని నిర్ణయించుకున్న వేగురుపల్లి యువత, క్రికెట్‌ను ఎంచుకుంది. ప్రతిరోజూ క్రికెట్ ఆడుతూ, గ్రామంలోని విద్యార్థులు, ఇతర యువతను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు.

పదిమందితో మొదలైన ఈ ప్రయత్నం ప్రస్తుతం డెబ్భై నుండి వంద మంది యువకులు ఎలాంటి చెడు ఆలోచనలకు వెళ్లకుండా క్రికెట్ ఆడే స్థాయికి చేరింది. క్రికెట్ ఆడుతున్నంతసేపు తమ ఫోన్‌లను పక్కన పెట్టేయడం ద్వారా వాటి వాడకాన్ని కూడా తగ్గించుకుంటున్నారు.

"మా ప్రయత్నం ఓ విప్లవం"

ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ... చాప కింద నీరులా ప్రవహిస్తున్న గంజాయి మహమ్మారి మా గ్రామానికి రాకుండా ఈ క్రీడను ఎంచుకున్నాం. దీనివల్ల గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండేందుకు ఈ ఆట మాకు సహాయపడుతుంది. పదిమందితో మొదలైన మా ప్రయత్నం ప్రస్తుతం ఒక విప్లవంలా మారింది" అని తెలిపారు. వేగురుపల్లి గ్రామ యువత చేస్తున్న ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ యువతను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story