రెండు నెలలుగా వడ్లు కొనడం లేదని సింగిల్ విండో సొసైటీకి తాళం వేసిన వైనం

by Ratna Kumari |

రెండు నెల‌లైనా వ‌డ్లు కొన‌డం లేద‌ని ఆవేదనతో నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన వైనమిది.

రెండు నెలలుగా వడ్లు కొనడం లేదని సింగిల్ విండో సొసైటీకి తాళం వేసిన వైనం
X
దిశ, తంగళ్లపల్లి : రెండు నెల‌లైనా వ‌డ్లు కొన‌డం లేద‌ని ఆవేదనతో నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపిన వైనమిది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు, జిల్లెల్ల మాజీ ఉపసర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ సింగల్ విండో కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సెంటర్‌లో వడ్లు పోసి రెండు నెలలు కావొస్తున్నా.. కాంటా వేయడం లేదని ఆగ్రహించిన ఆయన నేరెళ్ల సహకార సంఘ కార్యాలయం లోపల సిబ్బంది ఉండగానే తాళం వేశారు. సొసైటీ సిబ్బందికి అనుకూలంగా ఉన్నవారికి, పలుకుబడి ఉన్నవారి ధాన్యాన్ని ముందుగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
దీంతో అక్కడే ఉన్న స్థానికులు సముదాయించడంతో ఆందోళన విరమించి తాళం తెరిచారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై అధికార పార్టీ నాయకులే నిరసనకు దిగడం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సింగిల్ విండో చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ ను వివరణ కోరగా.. ధాన్యం కొనుగోలు వేగంగానే జరుగుతున్నాయని, తూకం కూడా త్వరగానే జరుగుతుందన్నారు. లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతుందని స్పష్టం చేశారు.
Next Story