- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరదలు కోసం వదిన ఆరాటం.. ఓటు వేయాలని కాళ్లు మొక్కిన వదిన
మరదలుకు ఓటు వేయాలని వదిన పలువురి కాళ్లు మొక్కి వేడుకుంటుంది.

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండో వార్డులో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రతిపాదించిన ఇండిపెండెంట్ అభ్యర్థి దయ్యాల చంద్రకళ తరఫున ఆమె వదిన కచ్చు లక్ష్మి ఓటర్లను అభ్యర్థిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. మరదలికి ఓటు వేయాలని కోరుతూ కచ్చు లక్ష్మి రోడ్డుపైనే ఓటర్ల కాళ్లు మొక్కుతూ వేడుకోలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగడం, ఓట్ల కోసం ఈ స్థాయిలో అభ్యర్థించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఓటర్లను కలుసుకుంటూ “మా మరదలిని గెలిపించండి” అంటూ భావోద్వేగపూర్వకంగా అభ్యర్థించిన వదిన తీరుపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మరికొందరు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్నిసార్లు ఇలాంటివి తప్పవని వ్యాఖ్యానిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటు కీలకమవడంతో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు గెలుపుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్న దృశ్యాలు జగిత్యాలలో కనిపిస్తున్నాయి.






