కరీంనగర్ కార్పొరేషన్‌లో కాస్ట్​లీ ఫోన్ల కలకలం..

by Kodari Anjali |

అవినీతి అక్రమాలకు కరీంనగర్ నగర పాలక సంస్థ నిలయంగా మారింది.

కరీంనగర్ కార్పొరేషన్‌లో కాస్ట్​లీ ఫోన్ల కలకలం..
X

దిశ, కరీంనగర్ బ్యూరో : అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన కరీంనగర్ నగర పాలక సంస్థ.. పాలకులు మారిన ప్రతి సారి పంథాను మార్చుకుంటూ అవినీతి అక్రమాలను యథేచ్ఛగా సాగించేందుకు మరో అడుగు ముందుకు వేస్తూనే ఉంది.. అందుకు ఎప్పటికప్పుడు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తుంది అనే అభిప్రాయాలు నగరంలో వ్యక్తమవుతున్నాయి. గతంలో అడుగడుగునా నగరపాలక సంస్థలో అక్రమాలపై విమర్శలు వ్యక్తమవ్వగా ఈ సారి పాలక వర్గంలో నగర ప్రజలు నూతన కార్పొరేటర్లకు అవకాశం కల్పించారు. నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు సైతం అవినీతి అక్రమాలను కడిగి పారేసెందుకు కుతూహలంతో ఉన్న వారి సంఖ్య ఎక్కువే. దీంతో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిన నగరపాలక సంస్థ కాస్లీ ఫోన్ స్కెచ్ కు శ్రీకారం చుట్టడం ఇప్పుడు నగరం లో చర్చానీయాంశంగా మారింది.

కార్పొరేటర్లకు కాస్ట్​లీ ఫోన్​...

కరీంనగర్ నగర పాలక సంస్థ పాలన సౌలభ్యం కోసం కార్పొరేటర్లకు ఫోన్ లు అందించాలనే ఆలోచన అభినందనీయమే. కానీ కాస్ట్​లీ ఫోన్ అనే అంశం అభ్యంతరాలకు ఆజ్యం పోస్తుంది. గతంలో ఫోన్ నంబర్ల సిమ్ కార్డులు అందించి ఫోన్ బిల్లులు చెల్లించిన ఆనవాయితీని కొనసాగించిన నగరపాలక సంస్థ ఇప్పుడు ఒక్కడుగు ముందుకు వేసి ఫోన్ లు కోనుగోలు చేయాలి అనే ఆలోచనకు రావడం వివాదస్పదంగా మారింది. అదికూడా రూ.40 వేల పై చిలుకు ధర పలికే ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించడం వివాదానికి కారణమవుతుంది. అయితే ఈ నిర్ణయాన్ని కొంత మంది కార్పొరేటర్లు వ్యతిరేకించినప్పటికి అధిక సంఖ్యలో కార్పొరేటర్లు అనుకూలంగా ఉండటంతో ఫోన్లు కొనుగోలు చేసేందుకు బడ్జెట్ ను కేటాయించిన నగరపాలక సంస్థ అందుకు టెండర్లను సైతం పిలిచింది. అయితే ఇప్పుడు ఈ కాస్ట్​లీ ఫోన్ల వివాదం నగరపాలక సంస్థలో అంతర్గతంగా దుమారం లేపుతుంది

66మంది కార్పొరేటర్లు 70 ఫోన్లు

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో నూతనంగా విలీనం అయిన గ్రామాలతో కలసి మొత్తం 66 మంది కార్పొరేటర్లు నూతనంగా ఎన్నికై పాలకవర్గంలో ఉన్నారు. అయితే నగరపాలక సంస్థ 70 ఫోన్లు కొనుగోలు చేసేందుకు టెండర్లను పిలిచింది. అయితే మిగత నాలుగు ఫోన్లు ఎవరికోసం అనేది చర్చ జరుగుతుండగా కోఆప్షన్ సభ్యులు అనే చర్చ జరుగుతున్నప్పటికీ కోఆప్షన్ సభ్యులు 5 గురు ఉండటం తో మొత్తం పాలకవర్గం సంఖ్య 71 కి చేరుతుంది. దీంతో ఆ 4 ఫోన్లు ఎవరికోసం అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి

కాస్ట్​లీ ఫోన్ తో కార్పొరేటర్ల కట్టడి ?

కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి పాతుకుపోతున్న పాలకవర్గ సభ్యులతో కార్పొరేషన్ మొత్తం అవినీతి అక్రమాలకు నిలయంగా మారుతుంది అనే విమర్శలు వ్యక్తం కావడంతో ఓటర్లు తాజాగా జరిగిన ఎన్నికల్లో అధిక శాతం కొత్తవారికి మొగ్గు చూపి పాలకవర్గంలోకి పంపించారు. దీంతో సుమారుగా 11 మంది మినహా మిగతా కార్పొరేటర్లు అందరూ కొత్తవారే కావడం తో జనంలో పారదర్శకంగా పాలన సాగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో మున్సిపల్ కార్పొరేషన్ కాస్ట్​లీ ఫోన్ల భాగోతానికి టెండర్లు పిలవడం తో అక్రమాలపై ప్రశ్నించే కుతూహలంతో ఉన్న కార్పొరేటర్లను కట్టడిచేసేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గడచిన రెండు సమావేశాల్లో ఒక్కసారి పరిచయాలు పాలన విధానం పై చర్చ జరగ్గా రెండవ సారి ప్రజల సమస్యలపై విజ్ఞప్తులు అభ్యంతరాలతో సమావేశం ముగినట్టు తెలుస్తుంది. భవిష్యత్ లో పాలకవర్గ సభ్యులు అక్రమాలపై అభ్యంతరాలు తెలుపకుండా దారికి తెచ్చుకునే క్రమంలో కార్పొరేషన్ అధికారులు కాస్ట్​లీ ఫోన్ తో కట్టడి చేసే చర్యలకు శ్రీకారం చుట్టినట్లు నగరంలో చర్చ జోరందుకుంది. అయితే పాలకవర్గం కాలం ముగిశాక పాలకవర్గ సభ్యులు ఫోన్లు అప్పగించి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకునే ఆనవాయితీ ఉన్నప్పటికీ నగరంలో జనం అమలుకునోచుకోని పాలకుల హామీలు పరిష్కారానికి నోచుకోని సమస్యలతో సతమతమవుతున్న ఈ సమయంలో లక్షల రూపాయలు వెచ్చించి ఫోన్లు కోనుగోలు చేయడం అవసరమా? అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓక వేల ఫోన్ తప్పని సరి అనుకుంటే ఆ స్థాయిలో ధరపెట్టి కోనుగోలు చేసే కంటే అంతకన్న తక్కువదరలో ఆన్ రైడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి కదా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

Next Story