ముగ్గురు పిల్లల తండ్రికి ఉపసర్పంచ్ పదవి ?

by Batti.Sumithra |

నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లల తండ్రికి ఉపసర్పంచ్ పదవి కట్టబెట్టారని ఆరోపిస్తూ ఎంపీఓకి ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

ముగ్గురు పిల్లల తండ్రికి ఉపసర్పంచ్ పదవి ?
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లల తండ్రికి ఉపసర్పంచ్ పదవి కట్టబెట్టారని ఆరోపిస్తూ ఎంపీఓకి ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో నూతనంగా ఏర్పడిన బుగ్గారం మండల గ్రామ పంచాయతీకి ఇటీవల ఉపసర్పంచ్ పదవికి ఉపఎన్నిక నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ ఎన్నికలో ఉపసర్పంచ్ గా ముగ్గురు పిల్లలు ఉన్న రామకృష్ణ గౌడ్ కి పదవి కట్టబెట్టారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి గురువారం ఈ ఘటన పై ఎంపీఓకి ఫిర్యాదు చేశారు. ఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఉపసర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్ గా కూడా రామకృష్ణ ఎన్నిక రద్దు చేయాలనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story