వీర్న‌ప‌ల్లి మండ‌లంలో అకాల వ‌ర్షం.. అపార న‌ష్టం

by Ratna Kumari |

వీర్నపల్లి మండలంలో మంగళవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన వరి పంట చేజారి పాయేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీర్న‌ప‌ల్లి మండ‌లంలో అకాల వ‌ర్షం.. అపార న‌ష్టం
X

దిశ, ఎల్లారెడ్డిపేట : వీర్నపల్లి మండలంలో మంగళవారం అకాల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన వరి పంట చేజారి పాయేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పిడుగులతో కూడిన రాళ్ల వడగళ్ల వర్షం కురిసింది. చేతికొచ్చిన పంట చేజారి పోవడంతో మెజార్టీ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వడగళ్ల వానతో వరి పంటలకు భారీ నష్టం మండలంలోని బాబాయి చెరువు తండా, బావుసింగ్ నాయక్ తండా, భూక్యా తండా, అడవి పదిర, రంగంపేట, గ్రామాల్లో వడగళ్ల వాన దాటికి వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి పంట నేలపాలయ్యాయి బావుసింగ్ నాయక్ తండా గ్రామపంచాయతీ చెందిన రైతు గుగులోతు పర్షరాములు రెండు ఎకరాల వరి పంట వడగళ్ల వానకు పూర్తిగా దెబ్బతింది. అప్పులు తెచ్చి సాగుచేసిన పంట కళ్ళముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story