- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి..
జగిత్యాల జిల్లాలోని మల్యాల – పూడూరు రైల్వే స్టేషన్ల మధ్య విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, కొడిమ్యాల (మల్యాల) : జగిత్యాల జిల్లాలోని మల్యాల – పూడూరు రైల్వే స్టేషన్ల మధ్య విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మల్యాల ఎస్‌ఐ నరేష్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం.. సుమారు 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మహేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునే క్రమంలో పోలీసులు పౌరుల సహాయాన్ని కోరుతున్నారు. ఎవరికైనా సమాచారం ఉంటే 8328512176 లేదా 9701112343 నంబర్లకు సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.






