- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకతీయ కెనాల్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదుల గట్టెపల్లి శివారులోని కాకతీయ కెనాల్‌లో సుమారు 30-35 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం నేడు లభ్యమైంది.

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదుల గట్టెపల్లి శివారులోని కాకతీయ కెనాల్‌లో సుమారు 30-35 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నేడు లభ్యమైంది. మృతుడు బీహార్ లేదా ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈదుల గట్టెపల్లి కారోబార్ ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం, మరణం సుమారు 3-4 రోజుల క్రితం సంభవించినట్లు తెలుస్తోంది. మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి, గుర్తించడానికి వీలు లేకుండా ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకోవడానికి, అలాగే మరణానికి గల కారణాలను నిర్ధారించడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని లేబర్ క్యాంపులలోని కార్మికులను విచారించి, ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నా పోలీసులు.






