- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెట్ పల్లి అనూహ్య మలుపు.. బీజేపీ నుంచి ఇద్దరు సస్పెండ్
మెట్‌పల్లి మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలవేళ అనూహ్య మలుపు తిరిగింది.

దిశ, మెట్ పల్లి : మెట్‌పల్లి మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలవేళ అనూహ్య మలుపు తిరిగింది. మున్సిపల్ చేర్మెన్ ఎన్నికలో బీజేపీకి చెందిన చెట్ల పల్లి మీనా- సుఖేందర్ చైర్మన్ అభ్యర్థి ఓటు కాంగ్రెస్ కు వేశారనే ఆరోపణలపై బీజేపీ కౌన్సిలర్ మీనా- సుఖేందర్ గౌడ్ లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు ఉత్తర్వులు జారీచేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించరంటూ సస్పెండ్ చేశామని పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడిన ఎవరినైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు. మెట్ పల్లి మున్సిపల్ రాజకీయాల్లో పరిణామం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
విప్ జారీ చేయడంలో బీజేపీ విఫలం..
విప్ జారీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సరైన సమయంలో సరైన పత్రాలు సమర్పించారని బీజేపీ మాత్రం విప్ పత్రాలు అధికారులకు ఇవ్వడంలో విఫలమైందని సరైన సమయంలో ఇవ్వకపోవడం తో విప్ పత్రాలు చెల్లవని అధికారులు తెలిపగా బీజేపీ కౌన్సిలర్ సభ్యులను ఆశ్చర్యానికి గురయ్యామని పార్టీ విప్ జారీ చేయడంలో ఎలా విఫలం అవుతుందని బీజేపీ కౌన్సిలర్ లు కొందరు జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ఇంటికి వెళ్లి దాడికి దిగారు. మొత్తానికి ఎంతో ఉత్కంఠoగా కొనసాగిన మెట్ పల్లి మున్సిపల్ అనూహ్య పరిణామాల మధ్య మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ దక్కించుకుంది.






