పోటా పోటీగా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుల ఏకగ్రీవం

by Ratna Kumari |

దిశ, మల్లాపూర్ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఇటీవ‌ల‌ జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీంతో కొత్త స‌ర్పంచ్ లు ఎన్నిక‌య్యారు.

పోటా పోటీగా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుల ఏకగ్రీవం
X

దిశ, మల్లాపూర్ : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఇటీవ‌ల‌ జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీంతో కొత్త స‌ర్పంచ్ లు ఎన్నిక‌య్యారు. మల్లాపూర్ మండలం లో 23 గ్రామ పంచాయతీలలో 11 కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, 9 బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, ఇద్ద‌రు స్వతంత్ర అభ్యర్థులు, బీజేపీ బలపరిచిన ఒక‌ అభ్యర్థి గెలుపొందారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షురాలిగా రోండ్ల రాజేశ్వరి రాజారెడ్డి, ఉపాధ్యక్షుడిగా కనుముల వెంకటేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే బీఆర్ఎస్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా తోట శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో వాల్గొండ తండ గ్రామానికి చెందిన సర్పంచ్ సురేష్ ఇద్దరికీ మద్దతివ్వడం కోసమెరుపు. కాంగ్రెస్ పార్టీ మండల ఫోరం అధ్యక్షురాలు కు 13 మంది సర్పంచ్ లు మద్దతు తెలుపగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుకి పది మంది సర్పంచ్ లు మద్దతు తెలిపారు. ఏది ఏమైనా ఒక్కరే ఉండాల్సిన మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పార్టీకి ఒక్కరు గా ఇద్దరు మండలాధ్యక్షులు అవ్వడంతో మండల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

Next Story