- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్విచక్ర వాహనం దగ్దం.. భయాందోళనలో స్థానికులు
దిశ, మెట్ పల్లి/ఇబ్రహీంపట్నం : ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

X
దిశ, మెట్ పల్లి/ఇబ్రహీంపట్నం : ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్దండి గ్రామంలో గోదావరి నది తీరాన ఇవాళ తెల్లవారుజామున స్నానం చేసేందుకు వెళ్లగా.. ఓ ద్విచక్ర వాహనం ఖాలీ బూడిద అయింది. ఈ ఘటనను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో గోదావరిలో చేపలకు వలలు వేసేందుకు వెళ్తారని.. వెళ్లిన వారిదే అయ్యుండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా గోదావరి నది తీరాన నిన్న రాత్రి ఏదైనా గొడవ జరిగిందా లేదా మందుబాబులు ఏమైనా విరంగం సృష్టించారా..? వాహన దారుడు ఏమయ్యాడు...? అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
Next Story






