గుంపుల్లో గంజాయి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ట్టివేత

by Ratna Kumari |

జగిత్యాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు

గుంపుల్లో గంజాయి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌ట్టివేత
X

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టౌన్ సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 10న టౌన్ ఎస్ఐ సధాకర్ తన సిబ్బందితో కలిసి గొల్లపల్లి రోడ్డు బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న గౌస్ ఖాన్ (32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతని వద్ద 270 గ్రాముల నిషేధిత గంజాయి లభించింది. నిందితుడి పై గతంలోనే జగిత్యాల టౌన్ పీఎస్ లో రెండు, కోరుట్లలో ఒకటి కలిపి మొత్తం నాలుగు కేసులు నమోదైనట్లు తేలింది. ఎస్ఐ సుప్రియ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Next Story