- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వసనీయ వార్తల వేదిక "దిశ" దిన పత్రిక
విశ్వసనీయ వార్తల వేదిక "దిశ" తెలుగు దినపత్రిక అని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు.

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : విశ్వసనీయ వార్తల వేదిక "దిశ" తెలుగు దినపత్రిక అని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. శుక్రవారం వేములవాడలో రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి సీతక్క దిశ దినపత్రిక- 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పని చేస్తూ ప్రజా సమస్యలను వెలికితీయడంలో దిశ క్రియాశీల పాత్ర పోషిస్తుందని, ఆ సమస్యలు పరిష్కారమయ్యే క్రమంలో పత్రిక ప్రత్యేక స్థానం సాధించిందన్నారు. అనాతి కాలంలోనే రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది అగ్ర పత్రికగా అవతరించినట్లు తెలిపారు. మిగతా దినపత్రికల కంటే ముందుగా వార్తలు అందించడం, డిజిటల్ మీడియాతో పాటు ప్రత్యేక పేజీలు, డైనమిక్ పేజీలను అందిస్తూ పాఠకులను ఆకట్టుకుంటుందని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో పత్రిక, ఛానల్ సేవలను మరింత విస్తృత పరిచి, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే వేదికగా పనిచేస్తున్న దిశ పత్రికకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని పత్రిక పాఠకులకు, వీక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న విలేకరులను అభినందిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.






