దళితబంధుకు ఎంపిక చేయలేదు.. టీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన

by Sathputhe Rajesh |   (  Updated:2023-03-24 17:53:32  IST  )

దిశ, పెద్దపల్లి: 20 ఏళ్లుగా టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేస్తున్నా తనకు అన్యాయం జరిగిందంటూ ఓ కార్యకర్త ఆవేదన ఇది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన మల్లేశం తనకు జరిగిన అన్యాయా

దళితబంధుకు ఎంపిక చేయలేదు.. టీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన
X

దిశ, పెద్దపల్లి: 20 ఏళ్లుగా టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేస్తున్నా తనకు అన్యాయం జరిగిందంటూ ఓ కార్యకర్త ఆవేదన ఇది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లికి చెందిన మల్లేశం తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఈ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఓ గుడిసె మాత్రమే ఉందని వివరించాడు. దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో తనలాంటి పేద వాళ్లకు అవకాశం ఇవ్వలేదన్నాడు. డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు దళిత బంధు లబ్ది చేకూర్చారని, తన లాంటి గరీబోళ్లను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Next Story