- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐడీ కోసం ఇబ్బందులు.. పెన్షన్‌కు అడ్డంకులు..? కరీంనగర్ ఖజానా శాఖలో కలకలం
కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో డిప్యూటీ డైరెక్టర్ వ్యవహారం నూతన ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుండగా పెన్షన్ అమలు చేయడంలో సైతం కొర్రీలు పెట్టడంతో పెన్షన్ పొందలేక సదరు అధికారి అడిగినా పత్రాలు సమర్పించలేక సతమతమవుతున్నారు.

దిశ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో డిప్యూటీ డైరెక్టర్ వ్యవహారం నూతన ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తుండగా పెన్షన్ అమలు చేయడంలో సైతం కొర్రీలు పెట్టడంతో పెన్షన్ పొందలేక సదరు అధికారి అడిగినా పత్రాలు సమర్పించలేక సతమతమవుతున్నారు. కాగా ప్రభుత్వం ఆయా శాఖలు ఇచ్చిన ఉద్యోగ ఆర్డర్ పత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ ఐడీ నంబర్ కేటాయించేందుకు ఇబ్బంది పెట్టడం సంబంధిత శాఖలు పెన్షన్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయగా అమలు చేయాల్సిన అధికారి సంబంధంలేని సర్టిఫికెట్స్ అడుగుతూ రిజెక్ట్ చేయడం కొర్రీలు, పర్సంటేజీలు అంటూ పరేషాన్ చేయడం కరీంనగర్ జిల్లా ఖజానా శాఖలో కలకలం రేపుతుంది .
ఐడీ నంబర్ ఇచ్చేందుకు ఇబ్బందులు
ప్రభుత్వం పలు శాఖల్లో నూతనంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇచ్చిన ఆర్డర్లను అమలు చేస్తూ ఐడీ నంబర్లు కేటాయిస్తూ జీతాలు చెల్లించాల్సిన జిల్లా ఖజానా శాఖ అధికారి తాజాగా ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 1200 వందల మందికి ల్యాబ్ టెక్నీషియన్ లకు ఉద్యోగాలు ఇవ్వగా కరీంనగర్ జిల్లాకు 12 మందికి ఉద్యోగాలు లభించాయి. అయితే అందరికీ ఒకే ఆర్డర్ ఉన్నప్పటికీ పర్సంటేజీ ఇచ్చిన వారికి ఐడీ నంబర్లు కేటాయించి ఇవ్వని వారికి తిరస్కరిస్తున్నారు. సదరు అధికారి ఒక ఉద్యోగి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు ఉద్యోగి ఆర్డర్ పత్రాలను తప్పు పడుతూ ఐడీ నంబర్ కేటాయించక పోవడంతో మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నా జీతం రాకపోవడం సదరు ఉద్యోగి ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సదరు ఉద్యోగి పరిస్థితి దేవుడు కరుణించినా పూజారి కనికరించని చందంగా తయారైంది.
పెన్షన్ అమలు చేసేందుకు అడ్డదారులు
ఆయా శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారికి లేదా ఏదైనా ప్రమాదం లేదా ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు పెన్షన్ అమలు చేయాల్సిన ఖజానా శాఖ అధికారి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా పెన్షన్ అమలు విధానం మూడు విభాగాలుగా అమలు అవుతుంది. ముందుగా మొదటి దశలో ఉద్యోగి విధులు నిర్వహించిన శాఖ నుంచి పెన్షన్ కోసం( ఏజి )అకౌంట్స్ జనరల్ ఆఫీస్ కి సిఫారసు చేస్తారు. రెండవ దశలో సదరు ఉద్యోగి కి సంబంధించి అన్ని ఆధారాలు పరిశీలించి సదరు ఉద్యోగి పెన్షన్ కు అర్హుడా.. అనర్హుడా నిర్ధారించి అర్హుడు అయితే పెన్షన్ మంజూరు చేసి ఖజానా శాఖకు పంపిస్తారు. ఇక్కడ పేమెంట్ అథారిటీ గా ఉన్న డీ.డీ పేమెంట్ చేయాలి, మూడవ దశలో అకౌంట్స్ జనరల్ కార్యాలయం ఆదేశాలను అమలు చేస్తూ పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలతో కరీంనగర్ జిల్లాలో పెన్షనర్లను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా విద్యా శాఖలో ఉద్యోగం చేసి విరమణ తర్వాత మృతిచెందగా ఆ ఉద్యోగి కుటుంబానికి 315 జీవో లో అర్హుడైన కుమారుడికి పెన్షన్ పథకాన్ని అమలు చేయాల్సిన ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ 45 రోజుల పాటు పెండింగ్ లో పెట్టి సంబంధం లేని పత్రాలు సమర్పించాలంటూ నోటీసు ఇవ్వడం సదరు అధికారి ఖజానా శాఖలో వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతుందని విమర్శలు వచ్చాయి.
ఖజానా శాఖలో కొర్రీలు పర్సంటేజీలు అంటూ పరేషాన్
జిల్లా ఖజానాశాఖలో అధికారి వ్యవహారశైలి ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి ఐడీ నంబర్లు కేటాయించడంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి 315 జీవో లో పెన్షన్ అర్హులకు పెన్షన్ పథకం అమలు చేయడంలో సదరు ఖజానశాఖ అదికారి కొర్రీలు పెడుతూ పర్సంటేజీల కోసం నేరుగా బాధితులతో డీల్ కుదుర్చుకుంటున్నారు అనే ఆరోపణలు ఆ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. బాధితులతో డీల్ కుదిరితే వెంటనే పథకాన్ని అమలు చేయడం డీల్ కుదరకపోతే కొర్రీలు పెడుతూ సంబంధం లేని పత్రాలు సమర్పించాలంటూ సతాయించడం ఇక్కడ ఆనవాయితీగా అమలవుతున్నా విధానం అని వివిధ శాఖల ఉద్యోగులే బాహాటంగా చర్చించుకుంటున్నారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.
ఎన్నో స్కాంలు వెలికితీశా.. ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు
‘నా ఇరవై ఐదు ఏళ్ల సీనియారిటీ లో ఎన్నో స్కాంలు వెలికి తీశా.. నేను పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నాను. సెలవు దినాలు సైతం ఉద్యోగం చేస్తున్నా. నేను ప్రమోషన్ లో ఉన్నా.. మా శాఖలో కొంత మంది అధికారులు అక్రమాలకు పాల్పడుతూ నన్ను అమలు చేయమంటే నేను ఎలా చేస్తాను. ప్రధానంగా ఆరోపణలు వ్యక్తమవుతున్న కేసులో సదరు ఉద్యోగికి ఆ శాఖ అధికారులు ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రంలో తప్పులు దొర్లాయి. అది నేను రాత పూర్వకంగా వారికి ఇచ్చాను. సరిచేసుకోవాలి అని సూచించాను. నేను గిట్టని వారు నాపై బురద చల్లేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ విమర్శలు. నేను ఇప్పటికే చాలా మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు రద్దు చేయించాను. నా పై విమర్శలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాను. లీగల్ నోటీసులు ఇస్తాను. మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి రేపు ఆఫీస్ లో ఉంటాను. నన్ను వచ్చి కలవండి. మీకు అన్ని ఆధారాలు చూపిస్తా.. మీకు కావలసిన వివరాలు ఇస్తా’ అని ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు వివరణ ఇచ్చారు.






