- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు!
రోజు రోజుకు అంతరించిపోతున్న అడవి సంపదతో లోపిస్తున్న ప్రకృతి సమతుల్యత లను కాపాడేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటి వాటిని

దిశ, మానకోండూర్ : రోజు రోజుకు అంతరించిపోతున్న అడవి సంపదతో లోపిస్తున్న ప్రకృతి సమతుల్యత లను కాపాడేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుంటే అవి పెరిగి పెద్దయ్యాకా అక్రమార్కులు వాటిని నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు. పర్యవేక్షించి చెట్లను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లను తొలగించి రోడ్డు భూమిని ఆక్రమిస్తుంటే మరికొందరు మంది చెట్లను నరికేసి మార్కెట్లో యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు. నడి రోడ్డు పై చెట్లను నరికేస్తూ ప్రకృతి సంపదను దోచేస్తుంటే అధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు ఇచ్చే నజరానా లతో అధికారులు కళ్లు మూసుకున్న కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నీరు గారుతున్న ప్రభుత్వ లక్ష్యం
అటవీ సంపద అంతరించిపోయి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు అడవులు పెంచేందుకు ప్రత్యేక పథకాలు ప్రారంభించి కోట్ల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుంది. అయితే అవి పెరిగి పెద్దయ్యాక అధికారుల చేతివాటంతో అక్రమార్కులు వాటిని ఇష్టాను సారంగా నరికేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపుల చెట్లు వృక్షాలు గా మారి బాట సారులకు నీడను, ఆక్సిజన్ ను అందిస్తుంటే వ్యవసాయ భూములకు నీడ వస్తుందంటూ కొందరు, మరికొందరు రోడ్డు భూమిని ఆక్రమించి సాగుచేసుకునేందుకు మరికొందరు చెట్లను నరికేస్తున్నారు. అక్రమార్కులు రూపాయి పెట్టుబడి లేకుండా చెట్లను నరికి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటుంటే ఒక మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఖర్చుపెట్టిన కోట్ల రూపాయలు నిష్ప్రయోజనంగా మారి ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది.
అమలుకు నోచుకోని వాల్టా చట్టం
ప్రభుత్వం అటవీ సంపదను కాపాడేందుకు తీసుకువచ్చిన వాల్టా చట్టం అమలుకు నోచుకోవడం లేదు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం చెట్లను కాపాడేందుకు తీసుకువచ్చిన చట్టాలు అమలు చేయాల్సిన అధికారుల చేతివాటంతో ప్రత్యేక చట్టాలు సైతం పేపర్లకు మాత్రమే పరిమితం అవుతున్నాయనేది స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు .చట్టాలు
అమలుకు నోచుకోకపోవడం తో అక్రమార్కులు చెట్లను ఇష్టాను సారంగా నరికివేస్తున్మారు. దీంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెంచిన వృక్షాలు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతున్నాయి .అయితే అందుకు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి అనే విమర్శలు లేకపోలేదు. చెట్లను నరికేముందు అక్రమార్కులు సంభందిత అధికారులకు నజరానాలు అప్పజెప్పుతున్నట్టు అక్రమార్కులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేత తరలింపుపై అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు
అధికారులు ఎక్కడ?
రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ చెట్లను నాటుతూ వాటిని సంరక్షిస్తుంది. వాటిని కాపాడేందుకు ప్రత్యేక నిధులు వెచ్చిస్తూ పెంచి పెద్దచేస్తుంది తీర వృక్షాలుగా మారాకా అధికారుల పర్యవేక్షణ లోపంతో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఎక్కడో మూలన మారుమూల ప్రాంతం అంటే వేరు ప్రధాన రహదారుల వెంట ఉన్న చెట్లను సైతం అక్రమార్కులు నరికేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ప్రతిరోజు అధికారులు వ్యక్తిగత అధికారిక కార్యక్రమాలకు వెల్తూనే ఉంటారు. సాక్షాత్తు వాల్ల వాహనాలు రోడ్డుపై వెల్తున్న సందర్భంలో సైతం చెట్ల నరికివేత జరుగుతున్న పట్టించుకోకపోగా సంబంధిత అక్రమార్కులకు ఫోన్లు చేసి పిలిపించుకుని వారికి అందాల్సింది అందకపోతే ఒక లెక్కా లేదు వారికి చేరాల్సిందిగా చేరితే అది మా బాధ్యత కాదు అంటూ చేతులు ఎత్తేయడం ఇక్కడి అదికారులకు అలవాటుగా మారింది. అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెట్ల నరికివేత కార్యక్రమం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు పువ్వులు ఆరుకాయలు గా సాగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి






