ట్రాక్టర్ బోల్తా...నలుగురు మృతి, రంగంలోకి ఎమ్మెల్యే

by velandi.Saikiran |

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చోటు చేసుకుంది.

ట్రాక్టర్ బోల్తా...నలుగురు మృతి, రంగంలోకి ఎమ్మెల్యే
X

*మొగిలిపేట లో ట్రాక్టర్ బోల్తా*

*నలుగురు మృతి, పలువురికి గాయాలు*

దిశ, మల్లాపూర్ : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పనుల నిమిత్తం మొగిలిపేట గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి సాయన్నకు పసుపు రిక్కడానికి 15 మంది మహిళలు వెళ్లారు. అయితే, ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

ట్రాక్టర్ లో సుమారు 15 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. మృతి చెందిన వారిలో సంపంగి సాయమ్మ (35)మంగళరపు లలిత (42)రోడ్డ వైష్ణవి (13)పెద్దిరెడ్డి గంగు (45) ఉన్నారు. పలువురికి గాయాలవ్వగా వారిని మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడ్డ వారిని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరమార్శించారు.

Next Story