- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటుతో వ్యక్తి మృతి
దిశ, ఎల్లారెడ్డి పేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని గుంట పెళ్లి చెరువు తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన గుగులోత్ రవి నాయక్ బ్రతుకుదెరువు కోసం ఆరునెలల

దిశ, ఎల్లారెడ్డి పేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని గుంట పెళ్లి చెరువు తండాకు చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన గుగులోత్ రవి నాయక్ బ్రతుకుదెరువు కోసం ఆరునెలల క్రితం విజిట్ వీసా పై సౌదీ కి వెళ్లి గుండెపోటుతో శనివారం మరణించాడు. అప్పులు చేసి బ్రతుకుదెరువు కోసం సంవత్సర క్రితం సౌదికి వెళ్లిన రవి నాయక్ తన గదిలో గుండెపోటుతో మరణించినట్లు సమాచారం రావడంతో అతని కుటుంబ సభ్యులు అతనిబంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు. ఈ సమాచారాన్ని గ్రామ మాజీ సర్పంచ్ మాలోత్ పుణ్య నాయక్, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తో మాట్లాడగా ఆయన సంబంధించిన అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వస్థలాని చేరడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానాని ఫోన్ ద్వారా తెలిపినట్లు వారు చెప్పారు. అప్పులు చేసి బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో మరణించిన రవి నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






