- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోపాలరావు పల్లె శివారులో పులి అడుగులు
by Ratna Kumari |
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించినట్లు తెలుస్తోంది.

X
దిశ, తంగళ్లపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపించినట్లు తెలుస్తోంది. గ్రామ శివారులోని మానేరు ప్రాంతంలో పులి సంచరించిన ఆనవాళ్లను గుర్తించారు. అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన విషయాన్ని ధృవీకరించారు. గోపాలరావు పల్లెతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు మానేరు వైపు వెళ్లవద్దని, రైతులకు ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. పులి సంచారం సమాచారంతో ఆయా గ్రామాల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






