దసరా ఎఫెక్ట్‌... నాటు కోళ్లను మాయం చేసిన దుండగులు

by velandi.Saikiran |   (  Updated:2025-10-04 16:44:42  IST  )

దసరా పండుగ రోజు ఓ నాటు కోళ్ల ఫామ్ లో దొంగలు పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోళ్ల ఫామ్ యజమాని

దసరా ఎఫెక్ట్‌... నాటు కోళ్లను మాయం చేసిన దుండగులు
X

దిశ, శంకరపట్నం : దసరా పండుగ రోజు ఓ నాటు కోళ్ల ఫామ్ లో దొంగలు పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోళ్ల ఫామ్ యజమాని నరహరి రమణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... తాడికల్ గ్రామ శివారులో మేలకుంట సమీపంలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన నాటు కోళ్లను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. దసరా పండుగకు కోళ్లను విక్రయించి మంచి లాభాలు గడించాలనుకున్న అతని ఆశ అడియాశ అయ్యింది.

కోళ్ల ఫారం లో రక్షణ కోసం అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చుకున్నా చోరీ జరిగిందని బాధిత రైతు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా గురువారం అర్థరాత్రి వేళ నాటు కోళ్ల ఫామ్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, 40 నాటు కోళ్లను ఎత్తుకెళ్లినట్లు సీసీ కెమెరాలను పరిశీలించగా తెలిసిందని అన్నారు.మొత్తం 150 కోళ్ల‌కు గాను 110 మాత్రమే ఫారంలో మిగిలాయని తెలిపారు. దోచుకెళ్లిన నలభై నాటు కోళ్ల విలువ దాదాపు 30 వేల రూపాయల వరకు ఉంటుందని, ఇట్టి సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

Next Story