ఉపాధి హామీ పనిలో ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యమే అంటున్న గ్రామస్తులు

by Disha Web Desk 23 |
ఉపాధి హామీ పనిలో ప్రమాదం.. అధికారుల నిర్లక్ష్యమే అంటున్న గ్రామస్తులు
X

దిశ,సుల్తానాబాద్ : మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా పెద్దమ్మ కుంట పూడిక పనుల తవ్వకాలు చేపడుతుండగా ప్రమాదవశాత్తు బండ రాయి కూలి బుర్ర స్వరూప, ఆవు నూరి తార, కల్వల లింగమ్మ అనే మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే మహిళలకు ప్రమాదం జరిగిందని, ఒక మీటరు లోతు తీయాల్సిన పూడిక, మూడు మీటర్ల లోతు వరకు కూలీలతో తీపిస్తూ ప్రభుత్వ సూచనలు తుంగలో తొక్కుతూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదానికి గురైన మహిళలను సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో దివ్యదర్శన్ రావు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించారు. ప్రమాదానికి గురైన మహిళల కుటుంబీకులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూడాలని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Next Story

Most Viewed